RGV: ఆ వార్తల్లో నిజం లేదు!: రామ్‌ గోపాల్‌ వర్మ

RGV News circulating that we stopped shooting work because one of our team has tested positive is incorrect
  • మా టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ప్రచారం
  • మేము షూటింగు ఆపేశామంటూ వార్తలు
  • అందరికీ కరోనా పరీక్షలు చేయించాం
  • అందరికీ నెగిటివ్ అని తేలింది
కరోనా విజృంభణ నేపథ్యంలోనూ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ షూటింగులతో బిజీగా ఉంటోన్న విషయం తెలిసిందే. షార్ట్‌ ఫిలిమ్స్‌తో పాటు బయోపిక్‌లు, హారర్ సినిమాలను ఆయన తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్ర బృందంలో ఒకరికి కరోనా రావడంతో షూటింగులు ఆపేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై రామ్‌ గోపాల్‌ వర్మ స్పష్టతనిచ్చారు. ఆ వార్తలను కొట్టి పారేస్తూ ట్వీట్ చేశారు.

'మా టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిన కారణంగా మేము షూటింగు పనులు ఆపేశామంటూ ప్రచారం అవుతోన్న వార్తలో నిజం లేదు. నిజానికి షూటింగును మొదలు పెట్టేటప్పుడు మేము అందరికీ కరోనా పరీక్షలు చేయించాం.. అందరికీ నెగిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలను మేము కచ్చితంగా పాటిస్తున్నాము' అని చెప్పారు.

RGV
Tollywood
Corona Virus

More Telugu News