Sai Pallavi: ఇలాంటి రాక్షస లోకంలోకి మరో బిడ్డను తీసుకువచ్చే అర్హత కోల్పోయాం: సాయిపల్లవి

Sai Pallvi reacts with very anger over a heinous crime
  • తమిళనాడులో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
  • తీవ్రంగా చలించిన సాయిపల్లవి
  • మానవజాతిపై నమ్మకం సన్నగిల్లుతోందంటూ వ్యాఖ్యలు
నానాటికీ మానవజాతిపై నమ్మకం సన్నగిల్లుతోందంటూ ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనులను కాపాడేందుకు ఉపయోగించాల్సిన శక్తిని తప్పుడు మార్గాలకు ఉపయోగిస్తున్నామని వ్యాఖ్యానించారు. తమిళనాడులో ఏడేళ్ల చిన్నారి రెండ్రోజుల క్రితం తప్పిపోయింది. అయితే ఆ బాలికపై అత్యాచారానికి తెగబడిన కిరాతకులు ఆపై హత్య చేశారు. ప్రస్తుతం తమిళనాడును ఈ ఘటన అట్టుడికిస్తోంది. దీనిపై సాయిపల్లవి ట్విట్టర్ లో స్పందించారు. రాక్షసానందం పొందడం కోసం చిన్నారులను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు.  

మానవ మనుగడను ప్రక్షాళన చేయాల్సిన అవసరం గురించి ప్రకృతి అనునిత్యం మనకు చెబుతూనే ఉందని, కానీ దారుణాలు చూడ్డానికే మనం ఇంత హీనమైన జీవితాన్ని గడుపుతున్నామని పేర్కొన్నారు. ఏదేమైనా ఇలాంటి అమానవీయ లోకంలోకి మరో బిడ్డను తీసుకువచ్చే అర్హత కోల్పోయాం అంటూ తీవ్ర భావోద్వేగాలు ప్రదర్శించారు.
Sai Pallavi
Child
Murder
Tamilnadu

More Telugu News