Kilaru Rosaiah: మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

YSRCP MLA Kilaru Rosaiah tested corona positive
  • ఇప్పటికే ఇద్దరు వైసీపీ శాసనసభ్యులకు కరోనా
  • తాజాగా పొన్నూరు ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
  • లక్షణాలు లేవని వెల్లడించిన కిలారి రోశయ్య
ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా పొన్నూరు శాసనసభ్యుడు కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.

 తనకు కరోనా సోకిందని, కానీ ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు. వైద్యపరీక్షల్లో పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లో ఉంటున్నానని తెలిపారు. అందరి అభిమానంతో త్వరలోనే కోలుకుంటానని అన్నారు. సీఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ కోసం జిల్లా కలెక్టరేట్ కు వెళ్లినప్పుడు కరోనా పరీక్షల ఫలితం గురించి సమాచారం అందిందని చెప్పారు.

కాగా, వైసీపీలో ఇంతకుముందే మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కూడా కరోనా బారినపడ్డారు.
Kilaru Rosaiah
Corona Virus
Positive
YSRCP
Andhra Pradesh

More Telugu News