సీఎం జగన్ ఈ పరిస్థితుల్లో అంబులెన్స్ లు ప్రారంభించడం అభినందనీయం: పవన్ కల్యాణ్

03-07-2020 Fri 18:01
  • 1088 అంబులెన్స్ లు ప్రారంభించిన సీఎం జగన్
  • జగన్ చర్యను స్వాగతించిన పవన్
  • కరోనా టెస్టుల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు
Pawan Kalyan appreciated CM Jagan who launched new ambulances

ఏపీ సీఎం జగన్ జూలై 1న 1088 అత్యాధునిక అంబులెన్స్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రారంభించడం అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు ప్రజలకు కూడా పవన్ పిలుపునిచ్చారు. ఇది ప్రపంచానికే గడ్డుకాలమని, అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం అని పేర్కొన్నారు.