Narendra Modi: 'భారత్ మాతా కీ జై' నినాదాలతో లడఖ్‌లో సైనికుల మధ్య నడుస్తున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో

modi video in ladakh
  • చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్‌లో మోదీ పర్యటన
  • నిము ప్రాంతంలో అధికారులతో భేటీ
  • ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ సిబ్బందికి సూచనలు
చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లడఖ్‌లోని నిము ప్రాంతంలో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ ఆర్మీ అధికారులతో సమావేశం అయ్యారు. ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ప్రధానికి ఉన్నతాధికారులు వివరించి చెప్పారు. లడఖ్‌లో తీసుకుంటోన్న చర్యల గురించి మోదీకి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే తెలిపారు.

ఆర్మీకి పలు సూచనలు చేసిన మోదీ అనంతరం సైనికుల వద్దకు మరోసారి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మోదీ పర్యటన సందర్భంగా సైనికులు భారత్‌ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Narendra Modi
BJP
India
China
Galwan Valley

More Telugu News