Ramcharan: కొత్త దర్శకుడికి చరణ్ ఛాన్స్ ఇస్తాడా?

Ram Charan liked the story of new director
  • కొత్త కథలు వింటున్న మెగా హీరో  
  • నూతన దర్శకుడి కథకు ఫిదా 
  • పూర్తి స్క్రిప్ట్ తీసుకురమ్మన్న చరణ్ 
లాక్ డౌన్ కారణంగా ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోవడంతో తారలంతా తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ సమయంలో బోర్ కొట్టకుండా కొందరు కొత్త విషయాలు నేర్చుకుంటుంటే .. మరికొందరు ఫ్యామిలీ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో హీరోలు కొత్త కథలు వింటూ ఫ్యూచర్ ప్రాజక్టులను ఖరారు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో మెగా హీరో రామ్ చరణ్ కూడా పలువురు చెబుతున్న కథలు వింటున్నాడు. అయితే, తాజాగా సతీశ్ అనే ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే పూర్తి స్క్రిప్టు తయారుచేసుకుని రమ్మని చెప్పాడట. అది కూడా ఆయనకు నచ్చితే కనుక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఇక ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత ఏ చిత్రం అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.
Ramcharan
RRR
Lockdown

More Telugu News