Allu Arjun: మాసిన గడ్డంతో అల్లు అర్జున్ కొత్త లుక్‌.. కేబీఆర్‌ పార్కులో బన్నీ, భార్య స్నేహ

allu arjun new look viral
  • షూటింగులు లేక ఇంట్లోనే ఉంటోన్న బన్నీ
  • ఇటీవల బయటకు వచ్చిన ఫొటోలు వైరల్
  • వాకింగ్‌కు వెళ్లిన బన్నీ, స్నేహ 
లాక్‌డౌన్‌ కారణంగా పార్కుల్లో జన సంచారం ఎక్కువగా కనపడట్లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానుల తాకిడి తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో సినీనటులు రోడ్లపై నడుస్తూ కనపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇలాంటి ఫొటోలు బయటకు వచ్చాయి.

ఆయన తన ఇంటి వద్ద వాకింగ్‌ చేయడం, సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం వంటి ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. తాజాగా, ఆయనకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. మాసిన గడ్డంతో అల్లు అర్జున్ ఇందులో కొత్త లుక్‌లో కనపడ్డాడు. తాజాగా ఆయన జూబ్లిహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్ వద్ద జాగింగ్ చేశాడు.

                                                         
 ఆయన భార్య స్నేహ కూడా వాకింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా, 'అల వైకుంఠపురంలో' సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
      
Allu Arjun
Tollywood
Hyderabad

More Telugu News