మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ... సింథియా వర్గానికే ఎక్కువ మంత్రి పదవులు!

03-07-2020 Fri 08:25
  • మధ్య ప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ
  • 28 మంది ప్రమాణ స్వీకారం
  • 14 మందికి మంత్రులుగా అవకాశం
Madhya Pradesh Cabinet Expansion

మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన మంత్రివర్గాన్ని గురువారం నాడు విస్తరించారు. చౌహాన్ తన క్యాబినెట్ లోకి 28 మంది కొత్త మంత్రులను చేర్చుకున్నారు. వారిలో 12 మంది జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం. కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 14 మందికి మంత్రి పదవులు లభించాయి. దీంతో సింధియా వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లయింది.

 మధ్యప్రదేశ్‌ తాత్కాలిక గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్ నిన్న‌ రాజ్ ‌భవన్ ‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ కార్యక్రమం సాగగా, కరోనా కారణంగా అమలులో ఉన్న నిబంధనలన్నింటినీ పాటించారు. ప్రమాణ స్వీకారం చేసిన 28 మందిలో 20 మంది క్యాబినెట్‌ హోదా మంత్రులు కాగా ఎనిమిది మంది సహాయ మంత్రులు. ఈ విస్తరణతో చౌహాన్‌ క్యాబినెట్ సభ్యుల సంఖ్య 34కు పెరిగింది.