Andhra Pradesh: ఈ నెల 22న ఏపీ మంత్రి వర్గ విస్తరణ.. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఇద్దరికి చోటు?

AP Cm Jagan to Expand his cabinet
  • రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్, మోపిదేవి
  • మంత్రిపదవులకు రాజీనామా
  • వారి స్థానంలో ఇద్దరు బీసీలకు చోటు
ఏపీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవులను ఈ నెల 22న భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం నుంచే ఇద్దరికి కేటాయిస్తారని సమాచారం. ఈ నెల 21తో ఆషాఢం ముగిసి శ్రావణం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణకు అదే మంచి ముహూర్తమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. కాగా, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Pilli Subhas Chandra Bose
Mopidevi Venkataramana

More Telugu News