Kanpur: నేరస్థుల ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి!

Eight UP Policemen Shot Dead By Criminals In Kanpur
  • క్రిమినల్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు
  • కాల్పులు ప్రారంభించిన ముఠా
  • పరారీలో ఉన్న ముఠా కోసం గాలింపు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం జరిగింది. కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వికాశ్ దూబే గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిన్న రాత్రి 16 మంది పోలీసుల బృందం వెళ్లింది. వారి రాకను గమనించిన దూబే ముఠా భవనం పైనుంచి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.

కాల్పుల అనంతరం ముఠా సభ్యులు పరారయ్యారు. వికాశ్ ముఠా జరిపిన కాల్పుల్లో గాయపడిన మరో నలుగురు పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ, ఐజీ, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరారీలో ఉన్న క్రిమినల్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. పోలీసుల మృతికి స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. దూబే ముఠాను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్‌సీ అవస్థిని ఆదేశించారు.
Kanpur
Uttar Pradesh
Police
criminal gang

More Telugu News