ఇక క్వార్టర్స్‌ను ఖాళీ చేయండి: వివాదాస్పద సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు బీఎస్ఎన్ఎల్ ఆదేశాలు
- శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి వెలుగులోకి వచ్చిన ఫాతిమా
- ఇటీవల కుమారుడు, కుమార్తెతో కలిసి అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్
- ఉద్యోగ పదవీ కాలం ముగిసినా క్వార్టర్స్ ఖాళీ చేయని ఫాతిమా
కాగా, ఇప్పటికే రెహానాపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తన కుమారుడు, కుమార్తెతో కలిసి తన అర్ధ నగ్న శరీరంపై పెయింట్ వేయించుకున్న రెహానా అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
2018లో శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత రెహానా ఫాతిమా వెలుగులోకి వచ్చారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పాప్యులర్ అయ్యారు. ఆ తర్వాత హిందువులపై సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో 18 రోజులపాటు రెహానా జైలు శిక్ష కూడా అనుభవించారు.