యూనివర్శిటీల్లో కూడా ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారు.. ఎక్కడ చూసినా వాళ్ల పెత్తనమే: సీపీఐ రామకృష్ణ
- రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైంది
- పార్టీ, యూనివర్శిటీల్లో మీ వాళ్లే ఉంటున్నారు
- విమర్శించే వారికి కులం ముద్ర వేస్తున్నారు
సామాజికన్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నారని... ఇతరుల మొహాన రేషన్ కార్డు పడేస్తే సామాజికన్యాయం అవుతుందా? అని మండిపడ్డారు. కింద నుంచి పై వరకు మొత్తం మీరే పంచుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఇతరులు ఏదైనా మాట్లాడితే కులం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. గ్రామగ్రామాన ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. ప్రతి యూనివర్శిటీలో మీటింగులు పెడతామని చెప్పారు.