Jagapathi Babu: చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు?

Jagapathi babu to play key role in Chiranjeevi film
  • కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 'ఆచార్య' 
  • చిరు తదుపరి చిత్రంగా 'లూసిఫర్' రీమేక్
  • ముఖ్య పాత్రకు జగపతిని ఎంచుకున్న సుజీత్
ఒకప్పుడు పలు చిత్రాలలో హీరోగా నటించి.. ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు శోభన్ బాబుకు ప్రత్యామ్నాయంగా నిలిచి.. విజయాలు సాధించిన జగపతిబాబు, తరం మారడంతో విలన్ పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సంగతి విదితమే.

ఈ క్రమంలో పలు చిత్రాలలో పవర్ ఫుల్ పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాల నుంచి, ఇటు యంగ్ హీరోల సినిమాల వరకు చాలా వాటిలో ఆయన విలన్ తరహా పాత్రలలో నటిస్తున్నారు. ఈ కోవలో తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమాలో కూడా ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది.

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు జగపతిబాబుని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం పూర్తయ్యాక 'లూసిఫర్' రీమేక్ సెట్స్ కి వెళుతుంది.  
Jagapathi Babu
Chiranjeevi
Sujeeth
Koratala Siva

More Telugu News