Varla Ramaiah: జనాలు అనుకుంటున్న మాటే నిజం చేశారుగా?: వర్ల

Varla Ramaiah fires on Jagan
  • రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు
  • ముగ్గురు మీ వాళ్లకే కట్టబెట్టారు
  • ఇది ఇతరులను అవమానించడం కాదా?
వైసీపీ పార్టీ కార్యకలాపాలను ప్రాంతాలవారీగా మూడు భాగాలుగా విభజించి, వాటి బాధ్యతలను ముగ్గురు నేతలకు జగన్ అప్పగించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డిని... ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి... కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

'ముఖ్యమంత్రి గారూ! రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న మాటే నిజం చేశారుగా? రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి మనవాళ్లు ముగ్గురికి కట్ట పెట్టారుగా? ముఖ్యమైన పనులు మావాళ్లే చేస్తారు అన్నట్లుగా వుంది మీ పనితీరు. ఇతరులను అవమానం పాలు చేస్తున్నట్లు కాదా? ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసినట్లు లేదా? ఎలా?' అని ఆయన ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP

More Telugu News