Sri Rapaka: బాలకృష్ణ వ్యక్తిత్వం ఎలాంటిదో వెల్లడించిన 'నేకెడ్' చిత్రం హీరోయిన్ స్వీటీ!

Balakrishna is a nice person says Naked heroine Sri Rapaka
  • కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన స్వీటీ
  • శ్రీ రాపాక పేరును స్వీటీగా మార్చిన వర్మ
  • బాలయ్య చాలా మంచి మనిషి అన్న స్వీటీ
కరోనా సమయంలో కూడా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమాత్రం దూకుడును తగ్గించలేదు. అందరూ షూటింగులు ఆపేసి ఖాళీగా కూర్చుంటే... వర్మ మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ పోతున్నారు. ఆయన తాజా చిత్రం 'నేకెడ్ (నగ్నం)' ట్రైలర్స్ ఇంటర్నెట్ లో సెన్షేషన్ గా మారాయి. ఈ చిత్రంలో కీలకపాత్రను స్వీటీ పోషిస్తోంది.

ఇక ఆమె అసలు పేరు శ్రీ రాపాక కాగా... వర్మ ఆమెను స్వీటీగా మార్చారు. స్వీటీ సినీ పరిశ్రమకు కొత్త కాదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లతో కలసి పనిచేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఆమె ఇంటర్వూ ఇచ్చింది. ఇందులో బాలకృష్ణ వ్యక్తిత్వం ఎలాంటిదో ఆమె తెలిపింది.

తాను ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలకు పని చేశానని స్వీటీ చెప్పింది. ఓ సారి డిస్కషన్ కోసం బాలయ్యగారి ఇంటికి వెళ్లానని తెలిపింది. బాలయ్యకు కోపం ఎక్కువని అందరూ అనుకుంటారని...కానీ, ఆయన చాలా మంచి మనిషి అని చెప్పింది. చిన్నపిల్లల మనస్తత్వమని తెలిపింది. తనలాగే ఆయన కూడా షార్ట్ టెంపర్ అని... క్షణాల్లో కోపం వచ్చేస్తుందని చెప్పింది. స్త్రీలకు ఆయన ఎంతో గౌరవమిస్తారని పేర్కొంది. 
Sri Rapaka
Naked Movie
Ram Gopal Varma
Balakrishna
Tollywood

More Telugu News