ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిన కరోనా ఉద్ధృతి.. అమెరికాలో ఒక్కరోజులో 52,898 మందికి కరోనా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిన కరోనా ఉద్ధృతి.. అమెరికాలో ఒక్కరోజులో 52,898 మందికి కరోనా

coronavirus cases in the world
  • ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,08,03,599 కేసులు
  • మృతుల సంఖ్య 5,18,968
  • ఆసుపత్రుల్లో 43,45,614 మందికి చికిత్స
  • 64,57,985 మంది డిశ్చార్జ్ 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,08,03,599 కరోనా‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,18,968కి చేరింది.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 43,45,614 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,57,985.  

అమెరికాలో కరోనా ఉద్ధృతికి ఏ మాత్రం అడ్డుకట్టపడట్లేదు. గత 24 గంటల్లో కొత్తగా 52,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,79,953గా ఉంది. అమెరికాలో మృతుల సంఖ్య 1,30,798కి చేరింది. ఇప్పటివరకు 11,64,680 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రుల్లో 14,84,475 మంది కరోనా రోగులకు చికిత్స అందుతోంది.

అమెరికా తర్వాత బ్రెజిల్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. ఆ దేశంలో నిన్న ఒకేరోజు 45,000 కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 14,53,369గా ఉంది. ఇప్పటివరకు 60,713 మంది మరణించగా, 5,65,790 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 8,26,866 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు.

ఇతర దేశాల్లో కరోనా కేసుల వివరాలు..
రష్యాలో మొత్తం కేసులు: 6,54,405
మృతుల సంఖ్య: 9536  

యూకేలో మొత్తం కేసులు: 3,13,483
మృతుల సంఖ్య: 43,906

స్పెయిన్‌లో మొత్తం కేసులు:  2,96,739
మృతుల సంఖ్య: 28,363

పెరులో మొత్తం కేసులు: 2,88,477
మృతుల సంఖ్య: 9860

చిలీలో మొత్తం కేసులు:  2,82,043
మృతుల సంఖ్య: 5753

Corona Virus
COVID-19
america

More Telugu News