అయోధ్యలో త్వరలో రామ మందిర నిర్మాణ పనులు.. మోదీకి ఆహ్వానం
- ఇప్పటికే గ్రౌండ్ లెవలింగ్ పనులు పూర్తి
- శ్రావణ మాసం చివరి రోజైన వచ్చే నెల 5న ముహూర్తం
- రావడం వీలుకాకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ప్రారంభించాలంటూ ప్రధానికి లేఖ
రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ జరిగిన నేపథ్యంలో పనులను ప్రారంభించాలని భావిస్తున్న ట్రస్ట్.. శ్రావణమాసం చివరి రోజైన ఆగస్టు 5న నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది. మరోవైపు, ఆలయాన్ని నిర్మించే ప్రదేశంలో భూమిని చదును చేసే పనులు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అలాగే, రాళ్లను చెక్కే పని కూడా ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం రామ జన్మభూమి స్థలాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మందిర నిర్మాణం కోసం తన వ్యక్తిగత సొమ్ము నుంచి రూ. 11 లక్షలు విరాళంగా ఇచ్చారు.