BSF: బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లో కలకలం రేపుతున్న కరోనా.. 2 వేల మందికిపైగా సంక్రమించిన వైరస్

2 thousand BSF and CRPF personnel infected to corona
  • బీఎస్ఎఫ్‌లో 1,018, సీఆర్‌పీఎఫ్‌లో 1,219 మందికి కరోనా
  • దేశవ్యాప్తంగా 6 లక్షలకు చేరువవుతున్న కేసులు
  • కోలుకుంటున్న 60 శాతం మంది
బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లలోని సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు దళాల్లోని 2 వేల మందికిపైగా కరోనా బారినపడడం కలవరపరుస్తోంది. సీఆర్‌పీఎఫ్‌లో 1,219 మంది, బీఎస్ఎఫ్‌లో 1,018 మందికి కరోనా సోకినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు, దేశ వ్యాప్తంగానూ కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా ఆరు లక్షలకు చేరువవుతోంది. నిన్నటి వరకు మొత్తంగా 5,85,493 మంది కరోనా బారినపడగా, 17,400 మంది మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత నెలలో ఏకంగా 4 లక్షల మంది కరోనా మహమ్మారి బారినపడడం ఆందోళన కలిగిస్తున్నా, బాధితుల్లో 60 శాతం మంది కోలుకుంటుండడం ఊరటనిచ్చే అంశమని ప్రభుత్వం పేర్కొంది.
BSF
CRPF
Corona Virus
India

More Telugu News