Atchannaidu: ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. సబ్ జైలుకు తరలింపు!

  • నిలకడగా ఉన్న అచ్చెన్న ఆరోగ్యం
  • విజయవాడ సబ్ జైలుకు తరలింపు
  • ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన టీడీపీ శ్రేణులు
Atchannaidu discharged from hospital

ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల ఆయన గుంటూరు లోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఏసీబీ అధికారులు కూడా ఆయనను ఆసుపత్రిలోనే మూడు రోజుల పాటు విచారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో... ఆసుపత్రి నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.

మరోవైపు తనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఆసుపత్రి నుంచి విడుదల చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కొలనోస్కోపీ పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని లేఖలో తెలిపారు. కరోనా పరీక్షలు చేయకుండా అధికారులు జైల్లోకి అనుమతించరని... అందువల్ల తనకు కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని కోరారు.

మరోవైపు, అచ్చెన్నాయుడు ఆసుపత్రి నుంచి విడుదలవుతున్నారనే  సమాచారంతో... ఆసుపత్రి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కోలాహలం నెలకొంది. వారందరి మధ్య నుంచే అచ్చెన్నను జైలుకు తరలించారు.

More Telugu News