Priyanka Chopra: అమెజాన్ ప్రైమ్ తో ప్రియాంక చోప్రా భారీ ఒప్పందం

Priyanka Chopra signs big deal with Amazon Prime
  • రెండేళ్ల పాటు కొనసాగనున్న కార్యక్రమం
  • హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందనున్న ప్రోగ్రామ్
  • మహిళలకు సంబంధించిన అంశాలకు మరింత ప్రాధాన్యత ఉంటుందన్న ప్రియాంక
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ లో అగ్రస్థాయికి ఎదిగిన నటిగా ప్రియాంక చోప్రాకు ఎంతో గుర్తింపు ఉంది. ఎంతో మంది భారతీయ సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రియాంక... హాలీవుడ్ లో సైతం నటించి, మెప్పించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ తో ఆమె భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ప్రాజెక్టు కోసం ఆమె సంతకం చేసింది. ఈ ఒప్పందం విలువ కోట్లాది రూపాయల్లో ఉందని తెలుస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని తెలిపింది. ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతిభకు ఒక ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేయాలనేది తన కోరికని... అందుకే సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ ను స్థాపించానని చెప్పింది. అమెజాన్ ప్రైమ్ తో చేయి కలపడానికి కూడా ఇదే కారణమని  తెలిపింది. మహిళలకు సంబంధించిన అంశాలకు ఇందులో ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.
Priyanka Chopra
Bollywood
Amazon Prime

More Telugu News