Lockdown: లాక్ డౌన్ కారణంగా పెరిగిపోతున్న షుగర్ లెవెల్స్!

  • మార్చి 23న లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన ఇండియా
  • ఇంటి నుంచే పని చేస్తున్న ఉద్యోగులు
  • సాధారణ స్థాయి కంటే 20 శాతం పెరిగిన షుగర్ లెవెల్స్
Sugar levels increased by 20 percent due to lockdown

కరోనా వైరస్ కారణంగా యావత్ దేశం మార్చి 23 నుంచి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ కారణంగా జనాలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో, ప్రజల జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంటి నుంచే కదలకుండా పని చేస్తుండటంతో... చాలా మందిలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తాజా సర్వేలో తేలింది.

దేశ వ్యాప్తంగా 8,200 మందిపై బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. లాక్ డౌన్ కారణంగా డయాబెటిక్ పేషెంట్లలో చక్కెర స్థాయులు ఉండాల్సిన దానికంటే 20 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. మార్చి నెల వరకు షుగర్ లెవెల్స్ 135 ఎంజీ/డీఎల్ గా ఉండగా... ఏప్రిల్ నెలాఖరుకు ఇది 165 ఎంజీ/డీఎల్ కు చేరింది. దీంతో వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆందోళనకు గురికాకుండా ఉండాలని సూచిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారు... తగిన వ్యాయామం చేయాలని చెపుతున్నారు.

కరోనా కేసులు పెరిగిపోతుండటంతో... పలు నగరాల్లో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాదులో సైతం లాక్ విధించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More Telugu News