Sensex: యూరోపియన్ మార్కెట్ల ప్రభావం.. స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

  • చివరి గంగలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు
  • 45 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 10 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Sensex up and Nifty down

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం నుంచి ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయినప్పటికీ... లాభాల్లోనే కొనసాగాయి. అయితే యూరోపియన్ మార్కెట్లు ప్రారంభమై, అవి బలహీనంగా ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో చివరి గంటలో మన సూచీలు లాభాలను కోల్పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు పతనమై 34,915కి పడిపోగా.. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 10,302 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (2.77%), నెస్లే ఇండియా (2.63%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.42%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.11%), హీరో మోటోకార్ప్ (1.73%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-28%), సన్ ఫార్మా (-1.84%), ఐటీసీ (-1.32%), ఓఎన్జీసీ (-1.21%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.15%).

More Telugu News