EAMCET: ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government postpones all entrance exams including EAMCET
  • తెలంగాణలో కరోనా బీభత్సం
  • విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్
  • పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి తెలంగాణలో రేపటి నుంచి పలు ఎంట్రెన్స్ టెస్టులు జరగాల్సి ఉంది. కీలకమైన ఎంసెట్ పరీక్షలకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే, కరోనా మహమ్మారి విజృంస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి.
EAMCET
Entrance Exams
Postpone
High Court
Telangana
Corona Virus

More Telugu News