China: ‘గీత’ దాటిన చైనా సైన్యం.. భారత భూభాగంలోకి 423 మీటర్లు చొచ్చుకొచ్చిన డ్రాగన్ కంట్రీ!

  • చైనా దురాక్రమణను స్పష్టం చేస్తున్న ఉపగ్రహ చిత్రాలు
  • నేడు భారత్-చైనా మధ్య భారత భూభాగంలో కమాండర్ స్థాయి చర్చలు
  • చైనా గుడారం కాలిబూడిద కావడమే గల్వాన్ ఘటనకు కారణమన్న కేంద్రమంత్రి
Chinese intrusion into Indian territory up to 423 meters in Galvan

చైనా ‘గీత’ దాటింది. భారత భూభాగంలోకి ఏకంగా 423 మీటర్ల మేర చైనా సైన్యం ముందుకు వచ్చినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 1960లో చైనా పేర్కొన్న సరిహద్దును దాటి మరీ ముందుకు వచ్చినట్టు ఆ చిత్రాల ద్వారా తెలుస్తోంది.గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు నేడు భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు దఫాల చర్చలు చైనా వైపున ఉన్న మోల్డోలో జరగ్గా, నేటి చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరగనున్నాయి.

కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చైనానే కారణమని, తొలిసారి చర్చలు జరిగినప్పుడు గల్వాన్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాల సైనికులు ఉండరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించడమే అందుకు కారణమని కేంద్రమంత్రి వీకే సింగ్‌ అన్నారు. చైనా సైనికులు అక్కడ నిర్మించిన గుడారం కాలి బూడిద కావడమే ఘర్షణకు కారణమైందన్నారు.

More Telugu News