వంతెన నిర్మాణ పనుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం.. టెండర్లు రద్దు చేసిన బీహార్ ప్రభుత్వం
- పాట్నాలో మహాత్మాగాంధీ వంతెన నిర్మాణ టెండర్లు రద్దు
- భాగస్వాములను మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కాంట్రాక్టర్లు
- గాల్వాన్ ఘటనలో అమరులైన వారిలో ఐదుగురు బీహారీలే
ఈ నెల 15న లడఖ్‌లోని గాల్వన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు బీహార్‌కు చెందిన వారే. చైనా తీరుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. వంతెన టెండర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం త్వరలోనే గతంలో చైనాతో కుదుర్చుకున్న ఇతర ఒప్పందాలను కూడా రద్దు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.