Jagan: దేశాభివృద్ధి కోసం పీవీ అందించిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయి: సీఎం జగన్

CM Jagan responds on PV Narasimharao birth anniversary
  • పీవీ శతజయంతి సందర్భంగా ఏపీ సీఎం స్పందన
  • ఎంతో వివేకవంతుడైన నేత అంటూ వ్యాఖ్యలు
  • జాతిని ఆర్థికస్వేచ్ఛ దిశగా నడిపించారంటూ కితాబు
దేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా కీర్తిని సొంతం చేసుకున్న తెలుగుజాతి ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుక సందర్భంగా ఏపీ సీఎం జగన్ స్పందించారు. పీవీ నరసింహారావు గారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందాం అంటూ ట్వీట్ చేశారు.

ఎంతో వివేకవంతుడైన రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు అయిన రావు గారు జాతిని ఆర్థిక స్వేచ్ఛగా నడిపించారని కొనియాడారు. దేశాన్ని పురోభివృద్ధి దిశగా నడిపించే క్రమంలో ఆయన అందించిన సేవలను భావి తరాలు కూడా గుర్తుంచుకుంటాయని వ్యాఖ్యానించారు.
Jagan
PV Narasimharao
Birth Anniversary
Andhra Pradesh
India

More Telugu News