Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ బయోపిక్‌లో హీరో ఇతడే.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ

Here is one of the actors in my new film POWER STAR
  • 'పవర్‌ స్టార్‌' పేరిట సినిమా
  • అతడు నా కార్యాలయానికి వచ్చాడు
  • ఆ సమయంలో ఈ షాట్ తీశాము
  • ఎవరినైనా ఈ వ్యక్తి పోలి ఉంటే ఇది యాదృచ్ఛికమే
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ 'పవర్‌ స్టార్‌' పేరిట బయోపిక్ తీస్తానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 'నా కొత్త సినిమా పవర్‌ స్టార్‌లో స్టార్‌ ఇతడే... అతడు నా కార్యాలయానికి వచ్చిన సమయంలో ఈ షాట్ తీశాము. ఎవరినైనా ఈ వ్యక్తి పోలి ఉంటే ఇది యాదృచ్ఛికమే.. ఉద్దేశపూర్వకంగా ఇది యాదృచ్ఛికమే' అని రామ్ గోపాల్‌ వర్మ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కల్యాణ్‌లా ఉన్నాడు. పవర్‌ స్టార్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నాడు.

కాగా, ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌ ఉంటారని ఆయన చేసిన ట్వీట్‌పై ఆ పదాలకు అర్థం చెబుతూ మెగాస్టార్‌, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించే ఆర్జీవీ ఆ పేర్లు తెలిపారని నెటిజన్లు కామెంట్లు చేస్తోన్న విషయం తెలిసిందే.
Pawan Kalyan
RGV
Tollywood

More Telugu News