China: గాల్వన్ ఘర్షణ: తమ ప్రభుత్వ తీరుపై మృతి చెందిన చైనా సైనికుల కుటుంబాల ఆగ్రహం

  • వెల్లడించిన బ్రీట్‌బార్ట్ న్యూస్ 
  • వెయిబోతో పాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా అసంతృప్తి
  • సైనికుల పేర్లు ప్రకటించలేదని ఆగ్రహం
  • అతి కొద్ది మంది ఆఫీసర్ల పేర్లే ప్రకటించిన చైనా
China failing to silence upset familes of soldiers killed in Galwan face off

తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో చైనా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరి కొంత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ఘర్షణలో చైనా ఇప్పటికీ మృతుల వివరాలు తెలపకపోవడం గమనార్హం. దీంతో చైనా ప్రభుత్వ తీరుపై ఆ సైనికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
   
చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వ్యవహరిస్తోన్న ఈ తీరుపై మృతుల కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని అమెరికా కేంద్రంగా నడిచే బ్రీట్‌బార్ట్ న్యూస్ తెలిపింది. వెయిబోతో పాటు చైనాకు చెందిన పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా సైనికుల కుటుంబ సభ్యులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నట్లు బ్రీట్‌బార్ట్‌ న్యూస్‌ ఎడిటర్‌ ఓ కథనంలో పేర్కొన్నారు. 

జూన్‌ 15న జరిగిన ఘర్షణలో 20 మంది తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత్‌ ప్రకటించింది. అదే సమయంలో చైనా వైపున కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందని చెప్పింది. చైనా మాత్రం ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేకపోతోంది.

ఇప్పటివరకు మృతి చెందిన అతి కొద్ది మంది ఆఫీసర్ల పేర్లే ప్రకటించింది. ఈ విషయంపై మృతి చెందిన చైనా సైనికుల కుటుంబాలు సామాజిక  మాధ్యమాల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని ఆ కథనంలో పేర్కొని చైనా తీరుని  బ్రీట్‌బార్ట్ న్యూస్ ఎండగట్టింది.

More Telugu News