Kolkata: నా భార్య చిత్రహింసలు పెడుతోంది.. వీడియో ఇదిగో!

 kolkata husband records video of beating
  • భర్త తల్లిదండ్రులు ఇంటికి రావడాన్ని సహించని భార్య
  • పిన్నులతో గుచ్చి, సిగరెట్లతో కాల్చి హింస
  • పోలీసులు ఉదాసీనంగా ఉండడంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
తన భార్య పెట్టే చిత్ర హింసలు భరించలేకపోతున్నానని, తనను కాపాడాలంటూ ఓ భర్త ఏకంగా కోర్టునే ఆశ్రయించాడు. కోల్‌కతాలో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన  జ్యోతిర్మయి మజుందార్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నాడు. కరోనా వైరస్ భయంతో కొంతకాలం క్రితం తన తల్లిదండ్రులను స్వగ్రామం బైద్యబతిలో వదిలిపెట్టి వచ్చాడు. కేంద్రం నిబంధనలు సడలించడంతో ఇటీవల మళ్లీ వారిని తన వద్దకు తెచ్చుకున్నాడు.

అయితే, వారిని ఇంటికి తీసుకురావడం ఇష్టంలేని భార్య.. భర్తను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. సిగిరెట్లతో కాల్చడం, పిన్నులతో గుచ్చడం, చెంపలు వాయించడం చేసేది. భార్య చిత్రహింసలు రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య ప్రతిరోజూ తనను హింసిస్తోందని, ఆమెపై గృహహింస కేసు కింద అరెస్ట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమె తనపై దాడిచేస్తున్న వీడియోలను వారికి చూపించాడు. అయినప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో జ్యోతిర్మయి హైకోర్టును ఆశ్రయించాడు.
Kolkata
Husband
wife
beating
High court

More Telugu News