Corona Virus: యాంకర్, డైరెక్టర్ ఓంకార్ కు కరోనా వార్తలపై స్పందించిన కుటుంబ సభ్యులు!

Corona Rumers on Anchor Omkar
  • సోషల్ మీడియాలో కరోనా సోకినట్టు ప్రచారం
  • ఆయన టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ వచ్చింది
  • జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్న కుటుంబీకులు
తెలుగు టీవీ ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ కు కరోనా సోకిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ, ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన రియాల్టీ షోల షూటింగ్, ఇటీవలి అనుమతులతో తిరిగి ప్రారంభం కాగా, ప్రస్తుతం ఓంకార్ ఇస్మార్ట్ జోడీ కార్యక్రమం వ్యాఖ్యాతగా పనిచేస్తూ, ఆ షూటింగ్ పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయనకు కరోనా సోకిందన్న వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు నిరాధారమని, పూర్తిగా అవాస్తవమని ఓంకార్ కుటుంబీకులు స్పష్టం చేశారు. ఓంకార్ కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నారని, నెగటివ్ వచ్చిందని అన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగానే ఆయన షూటింగ్ లకు హాజరవుతున్నారని తెలిపారు.
Corona Virus
Omkar
Family

More Telugu News