Lockdown: కరోనా మాస్క్ ధరించిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టగలరా?

Hero Ram Unique Corona mask
  • లాక్ డౌన్ కారణంగా నిలిచిన షూటింగ్ లు
  • ఇంటికే పరిమితమైన పలువురు సెలబ్రిటీలు
  • తలను కూడా కప్పివుంచే టీ షర్ట్ వేసుకున్న రామ్
కరోనా మహమ్మారిని అణచివేసేందుకు లాక్ డౌన్ ను అమలులోకి తేగా, టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమై, ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారన్న విషయాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ హీరో, ప్రత్యేకమైన మాస్క్ ను ధరించగా, ఆ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. తలను కూడా కప్పివుంచే ప్రత్యేకమైన టీ షర్ట్ ను తయారు చేయించుకుని అతను వేసుకున్నాడు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఇదే తరహా మాస్క్ లను ధరించాలన్నట్టుగా సూచిస్తూ, ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

అన్నట్టు ఈ హీరో ఎవరో తెలుసా?... రామ్. ప్రస్తుతం తిరుమల కిశోర్ దర్శకత్వంలో 'రెడ్' చిత్రంలో నటిస్తున్న రామ్, ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. 
Lockdown
Ram
Hero
Mask

More Telugu News