మత్తుమందు ఇచ్చి ఇంజినీరింగ్ విద్యార్థినిపై అశ్లీల వీడియోల చిత్రీకరణ... ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మత్తుమందు ఇచ్చి ఇంజినీరింగ్ విద్యార్థినిపై అశ్లీల వీడియోల చిత్రీకరణ... ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

Students makes obscene videos on classmate
  • గుంటూరులో ఘటన
  • విద్యార్థినిపై సహవిద్యార్థుల లైంగికదాడి
  • వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులు
గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై సహవిద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరించారు. ఇప్పుడా వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన దిశ పోలీసులు కౌశిక్, వరుణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ లైంగిక దాడి ఘటన మూడేళ్ల కిందట జరిగినట్టు తెలుస్తోంది. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, తాజాగా ఆమె చిత్రాలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తూ వేధింపులకు దిగారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపైనా చర్యలు ఉంటాయని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.
Students
Guntur District
Engineering
Assault

More Telugu News