Punarnavi: వాళ్లకు అవసరమైనదే చూపిస్తారు: బిగ్ బాస్ పై పునర్నవి విమర్శలు

Punarnavi sensational comments on Big Boss
  • బిగ్ బాస్ షోలో ఎంతో జరుగుతుంది
  • మొత్తాన్ని ఎడిట్ చేసి చూపిస్తారు
  • వాళ్లు చూపించిన దాన్నే జనాలు నిజమనుకుంటారు
తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ కు సిద్ధమవుతోంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని ప్రేక్షకులను వినోదాన్ని పంచారు. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున వంటి స్టార్లు మూడు సీజన్లకు హోస్టులుగా వ్యవహరించారు.

బిగ్ బాస్ కంటెస్టంట్లలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన వారిలో పునర్నవి ఒకరు. సినిమాల కంటే బిగ్ బాస్ ద్వారానే పునర్నవి ఎక్కువగా పాప్యులర్ అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాగ్ షోలో లోపల ఎంతో జరుగుతుందని... అయితే, మొత్తాన్ని ఎడిట్ చేసి చూపిస్తారని తెలిపింది. లోపల ఏం జరిగినా... వారికి అవసరమైనదాన్నే బయటకు చూపిస్తారని చెప్పింది. జనాలు అదే నిజమనుకుంటారని తెలిపింది. తనతో పాటు షోలో పాల్గొన్న అందరితో టచ్ లో ఉన్నానని చెప్పింది. అందరం మాట్లాడుకుంటుంటామని, ఈవెంట్లకు వెళ్తుంటామని తెలిపింది.
Punarnavi
Tollywood
Bigg Boss

More Telugu News