Kona Venkat: 30 ఏళ్లుగా బంజారాహిల్స్ లో ఉంటున్నాం... ఈ బాధ ఎప్పుడు తొలగిపోతుందో!: కోన వెంకట్

Kona Venkat tweets to KTR on power cuts while it was raining
  • వర్షం సమయంలో పవర్ కట్ పై కోన ట్వీట్
  • వర్షం పడితే హ్యాపీ ఫీలవుతామని వ్యాఖ్యలు
  • ఆ వెంటనే కరెంట్ పోతే ఎంతో బాధపడతామని వెల్లడి
హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడైనా వర్షం కాస్త భారీగా కురిసినా, వర్షం సమయంలో బలమైన గాలులు వీచినా పవర్ కట్ లు సాధారణం. దీనిపై ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందించారు. "హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మేం 30 ఏళ్లుగా నివసిస్తున్నాం. ఎప్పుడు వర్షం కురిసినా ముందు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత కరెంట్ పోవడంతో బాధ కలుగుతుంది. ఈ సమస్యను ఎప్పటికి అధిగమించగలం అని ఆలోచిస్తుంటాను" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ విద్యుత్ సంస్థను కూడా ట్యాగ్ చేశారు.

Kona Venkat
Rain
Power Cut
KTR
Banjarahills
Hyderabad
Tollywood

More Telugu News