అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుని, యువకుడి ఆత్మహత్య
- భీమవరంలో ఘటన
- ఓ యువకుడు కూడా తన ఆత్మహత్యకు కారణమని వీడియో
- వారిని శిక్షించాలని కోరిన యువకుడు
- రైలు కింద పడి ఆత్మహత్య
మృతుడి పేరు జక్కంపూడి కనకారావు అని పోలీసులు చెప్పారు. తనతో ప్రేమ పేరుతో ఒక యువతి చనువుగా ఉంటూ చివరకు మోసం చేసిందని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునే ఓ ముందు సెల్ఫీ వీడియోలో తెలిపాడని వివరించారు.
ఆ అమ్మాయితో పాటు ఓ యువకుడు కూడా తన చావుకు కారణమని, వారిని శిక్షించాలని అతడు సెల్ఫీ వీడియోలో కోరాడని వివరించారు. ఆ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన అనంతరం తమ బంధువులకు పంపాడని చెప్పారు.ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.