Doctors: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు డాక్టర్లకు కరోనా

Three doctors tested corona positive in Guntur Government Hospital
  • అత్యాచారానికి గురైన బాలికకు జీజీహెచ్ లో చికిత్స
  • బాలికతో పాటు ఆమె తల్లికి కరోనా పాజిటివ్
  • బాలికకు చికిత్స అందించిన ముగ్గురు డాక్టర్లు
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఏపీలోని గుంటూరు జిల్లాలో భారీగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలోనూ కరోనా కలకలం రేగింది. ఏకంగా ముగ్గురు డాక్టర్లు కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల అత్యాచారానికి గురై జీజీహెచ్ లో చేరిన ఓ బాలికకు ఈ ముగ్గురు డాక్టర్లు చికిత్స అందించారు. ఆ బాలికతో పాటు, ఆమె తల్లికి కూడా అప్పటికే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ బాలికకు చికిత్స అందించడంతో డాక్టర్లకు కూడా సోకింది. చికిత్స అందించే వైద్య సిబ్బందికే కరోనా సోకడంతో గుంటూరులో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, కరోనా సోకిన వైద్యులను క్వారంటైన్ కు తరలించారు.
Doctors
GGH
Corona Virus
Positive
Guntur

More Telugu News