Veligallu project: వెలిగల్లు ప్రాజెక్టు పేరును వైఎస్సార్ వెలిగల్లు రిజర్వాయరుగా మార్చిన ప్రభుత్వం

Veligalli project name changed as ysr veligallu reservoir
  • ఇక నుంచి దీనిని వెలిగల్లు ప్రాజెక్టుగా పిలవాలని ఉత్తర్వులు
  • సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు
  • ఎస్పీవీ ద్వారా రూ. 40 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం

కడప జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టు పేరును వైఎస్సార్ వెలిగల్లు రిజర్వాయరుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ ప్రాజెక్టును వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టుగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక  వాహక సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు మంజూరు చేసింది.

రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ పేరుతో ఎస్పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి జలవనరుల శాఖ నుంచి రూ. 5 కోట్ల పెట్టుబడి మంజూరుకు ఆదేశించింది. ఈ సంస్థ ద్వారా రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

  • Loading...

More Telugu News