Ayyanna Patrudu: సజ్జల గారూ.. పదేళ్లుగా అక్రమ కట్టడాల్లో ఉంటున్న జగన్ ను ఖాళీచేయించండి: అయ్యన్నపాత్రుడు

Since 10 years Jagan living in illegal Palaces says Ayyanna Patrudu
  • ప్రజాధనాన్ని లూటీ చేసి బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకున్నారు
  • లోటస్ పాండ్, తాడేపల్లిలో రాజ్ మహళ్లు కట్టుకున్నారు
  • ఇవన్నీ సక్రమ కట్టడాలేనా?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చేసిన సంగతి తెలిసిందే. వేదికను కూల్చి ఏడాది పూర్తైన సందర్భంగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో, అక్రమంగా నిర్మించిన కట్డడాన్ని కూల్చొద్దా? అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ ఏది అక్రమ కట్టడం సజ్జలగారూ? అని ప్రశ్నించారు.

రూ. 43  వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి బెంగళూరులోని యలహంకలో ప్యాలెస్ నిర్మించారని, హైదరాబాదులో లోటస్ పాండ్ రాజప్రాసాదం, తాడేపల్లిలో రాజ్ మహల్ కట్టుకున్నారని... ఇవన్నీ సక్రమమైన కట్టడాలేనా? అని ప్రశ్నించారు. గత పదేళ్లుగా జగన్ అక్రమ కట్టడాల్లోనే నివసిస్తున్నారని... వాటి నుంచి జగన్ రెడ్డిని ఖాళీ చేయించి... ప్రభుత్వ ఖజానాను పూరించాలని అన్నారు.
Ayyanna Patrudu
Telugudesam
Jagan
Sajjala
YSRCP

More Telugu News