Chiranjeevi: మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే సంతోషిస్తారా?: చిరంజీవి

Chiranjeevi attends anti drug webinar conducted at AP DGP Office
  • ఇవాళ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం
  • ఏపీ డీజీపీ కార్యాలయంలో వెబినార్
  • చిరంజీవి కీలక సందేశం
ఇవాళ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం. ఏపీ డీజీపీ కార్యాలయంలో దీనిపై వెబినార్ నిర్వహించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, నేటి యువత డ్రగ్స్ మత్తులో జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి జన్మ అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని అన్నారు. అలాంటి అందమైన జీవితాన్ని మత్తు పదార్థాలతో అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? అంటూ ప్రశ్నించారు. కొన్ని క్షణాల ఆనందం కోసం నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అన్నారు.

"డ్రగ్స్ వ్యసనంతో పతనంలోకి జారుకుంటున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వారి తరఫు నుంచి ఆలోచించండి. రేపు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే సంతోషిస్తారా? జీవితం పట్ల బాధ్యతగా ఉంటేనే అందులో ఆనందం వెల్లివిరుస్తుంది. ఏదేమైనా యాంటీ డ్రగ్ ప్రచారానికి ముందుకొచ్చిన పోలీసు డిపార్ట్ మెంట్ ను, డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అభినందిస్తున్నాను" అంటూ చిరంజీవి ప్రసంగించారు.
Chiranjeevi
World anti drug day
Webinar
AP DGP
Gautam Sawang

More Telugu News