Nara Lokesh: అచ్చెన్నాయుడు భార్య, కుమారులను పరామర్శించిన నారా లోకేశ్

Nara Lokesh visits Atchannaidu house
  • శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్న ఇంటికి వెళ్లిన నారా లోకేశ్
  • తామంతా అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చిన వైనం
  • అరెస్ట్ చేసిన వైనాన్ని అడిగి తెలుసుకున్న లోకేశ్
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా రిమాండ్ లో ఉన్నారు. అనారోగ్యం నేపథ్యంలో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలోనే సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో ఉన్న ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు నివాసానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లారు. అచ్చెన్న భార్య మాధవి, కుమారులను పరామర్శించారు. ధైర్యంగా  ఉండాలని, తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. దీంతోపాటు పార్టీ నేతలతో మాట్లాడి అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Nara Lokesh
Atchannaidu
Telugudesam
Wife

More Telugu News