Rajasthan: బీజేపీ, ఎన్డీఏని మోదీ, అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు: అశోక్ గెహ్లాట్

Rajasthan CM Ashok Gehlot lashes out at PM Modi Amit Shah
  • కేంద్ర కేబినెట్‌లో నలుగురు మంత్రుల గురించే ప్రజలకు తెలుసు
  • ఇతరులు ఎవరు ఉన్నారన్న విషయం కూడా తెలియదు
  • ఇతర నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'కేంద్ర కేబినెట్‌లో ముగ్గురు, నలుగురు మంత్రుల గురించి తప్ప ఇతరులు ఎవరు ఉన్నారన్న విషయం కూడా ప్రజలకు అంతగా తెలియదు. ఎందుకంటే, బీజేపీతో పాటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇతర నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు' అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ లేదని, ఆ పార్టీ అధిష్ఠానం ఇష్టం వచ్చినప్పుడు కీలక నేతలను పార్టీ నుంచి తొలగించేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ అశోక్ గెహ్లాట్ ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్‌తో పాటు, కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీలోని ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నించే అర్హత బీజేపీ నేతలకు లేదని అన్నారు.
Rajasthan
Ashok Gehlot
Narendra Modi
Amit Shah

More Telugu News