Raviteja: రవితేజ, రానా చిత్రానికి దర్శకుడిగా మరో పేరు!

Sagar Chandra considered for Raviteja and Rana multi starrer
  • మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం'
  • తెలుగులో నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్  
  • దర్శకుడు సాగర్ చంద్రతో ప్రస్తుతం చర్చలు  
మామూలుగా చాలా సినిమాల విషయంలో ముందుగా దర్శకుడిని అనుకున్నాక హీరోల కోసం ప్రయత్నిస్తారు. అయితే, ఇప్పుడు ఓ సినిమా విషయంలో హీరోలు రెడీ కాగా, దర్శకుడి కోసం వెతుకుతున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రం విషయంలో ఇది చోటుచేసుకుంది.

మలయాళంలో పెద్ద హిట్టయిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించడానికి రవితేజ, రానా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే దర్శకుడు మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు.

మొదట్లో హరీష్ శంకర్, సుధీర్ వర్మ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ, ఎవరూ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా సాగర్ చంద్ర పేరు తెరపైకి వచ్చింది. గతంలో 'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండే వాడు' చిత్రాలను రూపొందించిన సాగర్ చంద్రతో ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  
Raviteja
Rana
Hareesh Shankar
Sudheer Varma
Sagar Chandra

More Telugu News