TTD: ఎస్వీబీసీ చానల్‌లో ఇక ప్రకటనలు ఉండవు: టీటీడీ

svbc channel now turned add free
  • విసుగు తెప్పిస్తున్న ప్రకటనలపై భక్తుల ఆగ్రహం
  • దిగొచ్చిన టీటీడీ
  • యాడ్‌ఫ్రీ చానల్‌గా మార్పు
తమకు ఆదాయం కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)‌లో ప్రకటనలు విసుగు తెప్పించేలా ఉండడంతో భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చానల్‌ను ఇకపై యాడ్‌ఫ్రీగా మార్చాలని నిర్ణయించినట్టు టీటీడీ తెలిపింది. తమకు ఆదాయ వనరుల కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాదు, చానల్ నిర్వహణకు భక్తులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని పేర్కొంది. కాగా, చానల్‌ నిర్వహణ కోసం భక్తుల నుంచి ఇప్పటికే రూ. 25 లక్షల విరాళాలు అందినట్టు తెలిపింది.

TTD
SVBC Channel
add free

More Telugu News