Corona Virus: దేశంలో 15 వేలు దాటిన కొవిడ్‌-19 మృతుల సంఖ్య.. ఒక్కరోజులో 17,296 మందికి కరోనా

407 deaths and highest single day spike of 17296 COVID19 positive cases
  • గత 24 గంటల్లో 407 మంది మృతి
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,90,401
  • 1,89,463 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • ఇప్పటివరకు కోలుకున్న వారు 2,85,637 మంది
భారత్‌లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 17,296 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 407 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,90,401కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 15,301కి పెరిగింది. 1,89,463 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,85,637 మంది కోలుకున్నారు.

కాగా, జూన్‌ 25 వరకు దేశంలో మొత్తం 77,76,228 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో  2,15,446 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Corona Virus
COVID-19
India

More Telugu News