విమర్శకులపై మండిపడ్డ అలియా భట్ తల్లి
- బాలీవుడ్ లో నెపోటిజంపై విమర్శలు
- విమర్శిస్తున్న వారు ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న అలియా తల్లి
- స్టార్ కిడ్స్ అంతా సక్సెస్ కాలేరని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ స్పందించారు. తన కుమార్తెను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు. నెపోటిజం పేరుతో ఈ రోజు విమర్శలు గుప్పిస్తున్న వారంతా ఏదో ఒక రోజు వారి వారసుల గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఇండస్ట్రీలోకి వస్తామని వారి పిల్లలు కూడా అడిగితే... వారు ఏం చేస్తారని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలోకి రాకుండా ఆపుతారా? అని ప్రశ్నించారు. స్టార్ కిడ్స్ గా ప్రవేశించిన వారంతా సక్సెస్ కాలేరని... కేవలం టాలెంట్ ఉన్నవారు మాత్రమే నిలదొక్కుకుంటారని ఆమె చెప్పారు.