Bihar: బీహార్ లో పిడుగుల వాన... 83కి పెరిగిన మృతుల సంఖ్య

  • బీహార్ లో కొన్నిరోజులుగా భారీవర్షాలు
  • ఇవాళ పెద్ద సంఖ్యలో పిడుగులు
  • పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
Bihar suffered with massive lightening and thunderbolts

బీహార్ లో ఎన్నడూ లేని విధంగా పిడుగులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. కొన్నిరోజులుగా రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ పెద్ద సంఖ్యలో పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుల ధాటికి మరణించిన వారి సంఖ్య 83కి పెరిగినట్టు బీహార్ అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు.

పిడుగులు పడి ప్రజలు మృతి చెందడంపై సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిడుగుపాటు నేపథ్యంలో బీహార్ లోని పలు పాంత్రాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రేపు కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఎవరూ నిలబడరాదని అధికారులు హెచ్చరించారు.

More Telugu News