తాను రాజీనామా చేసిన స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకున్న డొక్కా... ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

25-06-2020 Thu 16:41
  • ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా
  • ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక
  • డొక్కా తప్ప మరెవరూ నామినేషన్లు వేయని వైనం
Dokka Manikya Varaprasad elected as MLC unanimously

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ రాజకీయవేత్త డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ స్థానానికి, టీడీపీకి రాజీనామా చేశారు. దాంతో ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నిక ప్రక్రియ చేపట్టగా, వైసీపీ తరఫున బరిలో దిగిన డొక్కా తప్ప మరెవరూ నామినేషన్ వేయలేదు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని బరిలో దించలేదు.