AP BJP: మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదు: వైసీపీ నేతలపై ఏపీ బీజేపీ వ్యాఖ్యలు

AP BJP hits out YSRCP comments on Park Hayat issue
  • ఓ హోటల్లో సుజనా, కామినేని, నిమ్మగడ్డ రమేశ్ భేటీ
  • తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు
  • రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా గుర్తించారా? అని ప్రశ్నించిన బీజేపీ
ఇటీవల హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలవడం తీవ్ర సంచలనం సృష్టించింది. వైసీపీ నేతలు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ విభాగం ఘాటుగా స్పందించింది.

'మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదు' అని స్పష్టం చేసింది. 'మీ ప్రభుత్వ విధానాలపై, మీ ఎంపీ-ఎమ్మెల్యేల నిరసనల నుంచి దృష్టి మరల్చడానికే వైసీపీ నేతలు హోటల్ విషయాన్ని మాట్లాడుతున్నారు' అంటూ ఏపీ బీజేపీ ఆరోపించింది. రమేశ్ కుమార్ బీజేపీ ఎంపీని కలిశారంటున్నారని, మరి రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా గుర్తించారా? అంటూ ప్రశ్నించింది. ఎస్ఈసీ విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా? అంటూ  నిలదీసింది.
AP BJP
YSRCP
Park Hayat
Nimmagadda Ramesh Kumar
Sujana Chowdary
Kamineni Srinivas

More Telugu News