Somireddy Chandra Mohan Reddy: అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా.. అచ్చెన్నపై ప్రభుత్వం కక్షసాధింపు: సోమిరెడ్డి

somireddy fires on ysrcp
  • 3 రోజులు ఆసుపత్రి బెడ్ పైనే విచారణకు కోర్టు అనుమతి
  • కోర్టునూ ధిక్కరిస్తారా?
  • అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని వైద్యులపై, పోలీసులపై ఒత్తిడి
  • మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
తమ పార్టీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. 'మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ నుంచి అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోంది. 3 రోజులు ఆసుపత్రి బెడ్ పైనే విచారణకు అనుమతిచ్చిన కోర్టునూ ధిక్కరిస్తారా. అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని వైద్యులపై, పోలీసులపై ఒత్తిడి తేవడం దారుణం' అని అన్నారు.

'ఒకటికి రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇలా వ్యవహరిస్తారా? అరెస్ట్ రోజు 14 గంటల పాటు కారులో తిప్పడం నుంచీ అచ్చెన్న విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఏపీలో సామాన్యుల నుంచి సీనియర్ ప్రజాప్రతినిధుల వరకు అందరి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన దురదృష్టకరం' అని విమర్శించారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Atchannaidu

More Telugu News