Vijay Sai Reddy: ఆ ముగ్గురి రహస్య కలయికను 9 కోట్ల మంది చూశారు: విజయసాయి రెడ్డి

Vijaya Sai Setires on Sujana Meeting with Nimmagadda and Kamineni
  • భేటీ వార్తలను తొక్కిపెట్టిన ఎల్లో మీడియా
  • సోషల్ మీడియా ఊరుకోదు కదా
  • ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ సెటైర్లు
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని కలిశారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి, తన ట్విట్టర్ వేదికగా, సెటైర్లు వేశారు. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసినా సామాజిక మాధ్యమాల్లో వీరి బాగోతాన్ని ప్రజలంతా చూశారని అన్నారు.

 "పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా" అని ఆయన వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Nimmagadda Ramesh Kumar
Sujana Chowdary
Kamineni Srinivas
Twitter
Park Hayat

More Telugu News